మద్యం తాగి వాహనాలు నడపొద్దు : ఎస్‌ఐ శ్రీధర్‌

Adialabad,Navatelangana,Telugu News,Telangana.నవతెలంగాణ-జైపూర్‌
మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఎస్సై శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం చెన్నూర్‌-మంచిర్యాల ప్రధాన రహదారిలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణించరాదని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు విధిగా హెల్మెట్‌ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా వాహనాలను మితిమీరిన వేగంతో నడపరాదని సూచించారు.