– జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్
మహిళా శక్తి పథకం ద్వారా నిర్దేశించిన క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్ పనులను జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా వైద్యాధికారి తుకారాంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి పథకం ద్వారా చేయూతనందించడం జరుగుతుందని, క్యాంటీన్ త్వరగా ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులకు క్యాంటీన్ ఉపయోగకరంగా ఉంటుందని, క్యాంటీన్లు నాణ్యమైన అల్పాహారం, వస్తువులు ఉండే విధంగా చూడాలని తెలిపారు. మహిళా శక్తి పథకంతో మహిళ సంఘాలకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. సోమవారం నాటికి క్యాంటీన్ ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని, ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు అధికారి రామకృష్ణ, ఆసుపత్రి పర్యవేక్షకులు చెన్నకేశవులు, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎపిఎం శ్రీనివాస్, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.