ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లాభాలు 49 శాతం పెరిగి రూ.580 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.390 కోట్ల లాభాలు నమోదయ్యాయి. క్రితం క్యూ1లో సంస్థ నికర ప్రీమియం వసూళ్లు 16 శాతం పెరిగి రూ.4504 కోట్లకు చేరాయి.