– డిప్యూటీ సీఎం భట్టికి టీఎంఎస్టీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు, సహా అధ్యక్షులు ఆంజనేయులు స్వామి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. 11 ఏండ్లుగా బదిలీల్లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తీర్పు వచ్చే విధంగా చొరవ తీసుకుని బదిలీలు చేయాలని కోరారు. ఎనిమిది జిల్లాల్లో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు రాలేదని పేర్కొన్నారు. 010 పద్దు కింద జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.