‘వికలాంగులకు చేయూత’ పేరుతో గ్రివెన్స్‌ సెల్‌

– కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వికలాంగులకు చేయూత పేరుతో గ్రివెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్టు వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేనీ వీరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వంద శాతం వైకల్యమున్నవారికి ఆగస్టు ఒకటి నుంచి డయల్‌ యువర్‌ చైర్మెన్‌ పేరుతో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ, సహకార కార్యాలయం సీతక్క ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.