– ప్రజల భాగస్వామ్యం కావాలి డీఆర్‌డీఓ సూర్యరావు
– మానవ అక్రమ రవాణాపై వీవోఏలు అప్రమత్తంగా ఉండాలి
– శంషాబాద్ డీఆర్డీఏ కార్యాలయంలో వీఓఏలకు రెండు రోజుల శిక్షణ
నవతెలంగాణ-శంషాబాద్
మానవ అక్రమ రవాణా నిర్మూలించాడానికి భాగ స్వామ్యం తప్పకుండా తీసుకోవాలని డీఆడ్డీఓ సూర్య రా వు అన్నారు. శుక్రవారం ప్రజ్వల స్వచ్చంద సంస్థ, శంషా బాద్‌లోని రంగారెడ్డి జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (డీఆర్‌డీఏ) కార్యాలయంలో మానవ అక్రమ రవాణాపై వీవోఏలకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమా న్ని ఆయన మండల మహిళా సమాఖ్య ఏపీఎం అహ ల్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మానవ అక్రమ రవాణాలో అమ్మాయిలు, మ హిళలు బాధితులు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. కొంతమంది మహిళల పేదరికం, మధ్యతరగతి మ హిళల అవసరాలను ఆసరాగా చేసుకుని ఉద్యోగం, ప్రే మ పెళ్లి, సినిమా అవకాశాల పేరుతో మోసాలకు గురి చేస్తున్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని అప్రమతంగా ఉండాలని సూ చించారు. గ్రామాల నుండి అమ్మాయిలను పట్టణాలకు తీసుకొచ్చి వ్యభిచారం వృత్తిలో దించుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. మొబైల్ ఫోన్స్ ద్వారా ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి అక్రమ రవా ణాకు గురి చేస్తున్నారని ఇలాంటి విషయంలో వీఓఏలు అప్రమత్తంగా ఉండి ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీఎం అహల్య మాట్లాడుతూ.. వీవోఏ లు మానవతా దృక్పథంతో అలోచించి తమ గ్రామ సం ఘ మహిళలకు స్థానిక పాఠశాలలో మానవ అక్రమ ర వాణాపై అవగాహనా కల్పించాలన్నారు. ప్రజ్వల సంస్థ కోఆర్డినేటర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ..మానవ అక్ర మ రవాణా నిర్ములనకు ప్రజ్వల సంస్థ 28 ఏండ్ల నుండి లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా పనిచేస్తు 28,600 మంది అమ్మాయిలను కాపాడి పునరావాసం కల్పించార న్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్ సునీత కృష్ణన్ ఈ మానవ అక్రమ రవాణా అరికట్టడంలో శక్తి వంచనా లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియా జుద్దీన్ మండల సమాఖ్య జిల్లా అధ్యక్షులు రాఘవదేవి, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ ప్రజల సిబ్బంది అనిల్, మితాళి రాజ్ తదితరులు పాల్గొన్నారు.