రామనర్సయ్యకు అండగా ఉంటాం…

– మంత్రి హరీశ్‌ రావు పరామర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానపద గాయకుడు గిద్దె రామ నరసయ్యను సోమవారం మంత్రి హరీష్‌ రావు పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఉద్యమ సమయంలో రామనర్సయ్య పాట ద్వారా చేసిన సేవలు మరిచిపోలేమని తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.