మంత్రి శ్రీధర్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంకు కరెంట్ సరఫరా చేయగలరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తో లద్నాపూర్ గ్రామానికి చెందిన గౌడ సంఘం సభ్యులు మంత్రికి విన్నవించగా, వెంటనే స్పందించి రామగిరి మండలం ఎన్ పిడిసిఎల్  ఎఈ కి ఫోన్ చేసి మాట్లాడి కరెంట్ సరఫరా చేయగలరని ఆదేశించారు. వెంటనే స్పందించి రామగిరి మండలం శ్రీ రేణుక ఎల్లమ్మ గుడికి కరెంట్ ఇప్పించిన శ్రీధర్ బాబుకు లద్నాపూర్ గౌడ సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.