భద్రకాళి బండ్ సమీపంలో బాధితుల ఆందోళన

– ఎఫ్ టీ ఎల్ పేరుతో పట్టభూముల్లో నిర్మించుకున్న ఇండ్లు కూల్చివేత
– సరైనది కాదు అంటున్న బాదితులు
– ఇరుకు నాలా వల్లనే కాలనీలలోకి మురుగు నీరు
– నాలాను విస్తరించాలంటున్న కాలని వాసులు
– నిరసన వ్యక్తం చేస్తున్న బాదితులు
నవతెలంగాణ – వరంగల్
హంటర్ రోడ్డు నుండి భద్రకాళి బండ్ వరకు నాలా చిన్న గా ఉండడంతో భారీ వర్షం వచ్చినప్పుడు చెరువు లోకి పోకుండా, వర్షం నీళ్లు భద్రకాళి బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు నీళ్లు రావడం ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే తంతు కొనసాగు తుంది. కానీ అధికారులు పెద్దనాలను ఏర్పాటు చేస్తే ఎంత భారీ వర్షం కురిసిన వర్షపు నీరు నాలా నుండి భద్రకాళి చెరువులోకి వెళ్తాయి. కానీ ఇట్టి విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎఫ్ టి ఎల్ ఎక్కడ వరకు ఉన్నదో నిర్ణయించకుండానే పరిమి షన్లు ఉన్న ఇండ్లను సైతం కూల్చి వేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ హంటర్ రోడ్ సర్వే నంబర్ 850 లో సుమారు 80 ఏళ్ల నుండి పట్టాదారుల పేరు మీద భూమి ఉన్నదని బాధితులు చెప్తున్నారు, భద్రకాళి బండ్ నిర్మాణం చేసే సమయం లో చెరువులో మట్టిని బండ్ పక్కకు పోశారు.అందువల్ల ఎఫ్ టి ఎల్ ఎక్కడి వరకు ఉందో తెలియకపోవడంతో బండ్ పక్కకు ఉన్నది అంతా ఎఫ్ టీ ఎల్ కిందికే వస్తుం దని అనుకోవడం సరైనది కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రకాళి బండ్ ఎఫ్ టి ఎల్ ను నిర్ణయించకుండానే సంబం ధిత కుడా, రెవిన్యూ, జీ డబ్ల్యూ ఎం సి అధికా రులు ఎఫ్టిఎల్ లో తమ ఇండ్లు ఉన్నాయని తమ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ విచారం వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి వచ్చి కూడా పర్మిషన్ ఇచ్చిన ఇండ్లను, ప్రహరీ గోడలను కూల్చివేయడం అత్యంత దారుణమని ఇప్పటికైనా సంబంధించిన అధికారులు ఎఫ్ టీ ఎల్ నిర్ణయించడంతోపాటు హంటర్ రోడ్ నుండి భద్రకాళి చెరువు వద్ద ఉన్న గాయత్రి గుడి వరకు పెద్దనాలను ఏర్పాటు చేస్తే భద్రకాళి సమీపంలో ఉన్న కాలనీలలో భారీ వర్షం వచ్చినా నీళ్లు కాలనీల లోకి చేరవని, వెంటనే నాల ను విస్తరించాలని, పర్మిషన్ ఉన్న ఇండ్లను కూల్చివేయవద్దని డిమాండ్ చేశారు.