నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ లో భారీ వర్షాలు ఉన్నందున ఎలాంటి అనుమతి లేకుండా అధికారులు నిజామాబాద్ హెడ్ క్వార్టర్ను వదిలి వెళ్ళకూడదని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ తెలియజేశారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ బారిక వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ఉన్నందున జొన్ 5 కి సంబంధించిన ఏఈ, సానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్ తో రిహాబిడేషన్ సెంటర్స్ బాబంసపహాడ్ లో లైనింగ్ ఏరియాస్ బోధన్ రోడ్ పలు ప్రాంతాలను సందర్శించారు. సంబంధిత అధికారులు అనుక్షణం అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి అనుమతి లేకుండా అధికారులు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లొద్దని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేశారు.