ప్రభుత్వ పాఠశాలల పని వేళల్లో మార్పులు 

– మండల విద్యాధికారి ఆంధ్రయ్య
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల పని వేళాలు మార్పులు చేయడం జరిగిందని మండల విద్యాధికారి ఆంధ్రయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలలు కూడా ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల వాలేనే ఉదయం 9గంటల నుండి సాయంకాలం 4:15 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.  కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు 22వ తేదీ సోమవారం నుండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలలు నడపాలని  మండల విద్యాధికారి ఆంధ్రయ్య తెలిపారు.