భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామానికి చెందిన బిచ్చాల సుగుణమ్మ పేరున అత్యవసర చికిత్స నిమిత్తం మంజూరైన 30 వేల రూపాయల సీఎం ఆర్ఎఫ్ చెక్కును భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు హన్మాపురం గ్రామశాఖ అధ్యక్షుడు తుమ్మేటి వెంకటేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్, బొబ్బిలి నర్సిరెడ్డి, హన్మగంటి బాల్ రాజ్ లు పాల్గొన్నారు.