ధర్మారం బి లో అమ్మ మాట – అంగన్వాడీ బాట..

Amma Mata in Dharmaram B - Anganwadi Path..నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి గ్రామంలోనీ కోడ్ నం 78 అంగన్ వాడి కేంద్రంలో శనివారం అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిచ్ పల్లి ప్రాజెక్ట్ సిడిపిఓ. స్వర్ణ లత,  డిచ్ పల్లి తార్డ్ సెక్టర్ సుపర్ వైజర్ శ్రీప్రియ పాల్గొని పిల్లలకు సాముహీక అక్షర అభ్యాసం చేయించారు.ఇదే కాకుండా చిన్నారులు, తల్లులతో గ్రామంలోని పలు విదూలలో ర్యాలీ నిర్వహించి, మొక్కలను  నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అదేశాల మేరకు అమ్మ మాట -అంగన్వాడి బాట కార్యక్రమం విజయవంతం గా నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలకు అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు.ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి దానిని సంరక్షించే విధంగా చూడాలని పేర్కొన్నారు.చిన్నారి తల్లిదండ్రులకు అంగన్వాడి కేంద్రాల చదువులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్  ఎడవెల్లి జ్యోతి సోమనాథ్, ఆయమ్మ,  ఆశ వర్కర్లు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.