నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్న పంట ఋణ మాఫీ 2024 పధకము అమలుకు సంబందించి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం నల్లగొండ నందు ఋణ మాఫీ పిర్యాధుల పరిష్కారము కొరకు జిల్లా స్తాయి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్ సెల్ నెంబర్ 7288800023 కి ఫోన్ చేసి రైతులు తమ సమస్యకు పరిష్కారం పొందవచ్చును. రైతులు పై నెంబర్ కు ఫోన్ చేసినప్పుడు రైతు ఆధార్ నెంబర్ తెలియచేయవలసి ఉన్నది. ఈ కాల్ సెంటర్ నెంబర్ మాత్రమే కాకుండా ఇద్దరు వ్యవసాయ అధికారులు 7288800016, 7288800017 ఫోన్ నెంబర్లకు కూడా ఫోన్ చేసి ప్రస్తుత స్తితి, పరిష్కార మార్గము తెలుసుకోవచ్చు. మండల స్తాయి లో మండల వ్యవసాయ అధికారికి ఫోన్ ద్వారా కానీ లేదా స్తానికంగా కలవడం ద్వారా కానీ రైతు పిర్యాధులకు పరిష్కారం పొందే అవకాశం ఉంది. సూచించిన ఫోన్ నెంబర్లకు రైతులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకునే అవకాశాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కల్పించారు.