ఉపాధ్యాయ ఉద్యమానికి బలరాం గారి సేవలు చిరస్మరణీయం..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ఉమ్మడి నల్లగొండ జిల్లా యూటీఎఫ్ పూర్వ మాజీ అధ్యక్షులు కామ్రేడ్ నల్లబెల్లి బలరాం సేవలు చిరస్మరణీయం అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి శుక్రవారం చౌటుప్పల్ మండల కేంద్రం యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో పేర్కొన్నారు. నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. కామ్రేడ్ బలరాంతో గల ఉపాధ్యాయ ఉద్యమ అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఉపాధ్యాయ ఉద్యమ నేత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పూర్వ అధ్యక్షులుగా పనిచేసిన నల్లబెల్లి బలరాం గారి మరణం విషాదకరమని వారి లేని లోటు ప్రజాతంత్ర అభ్యుదయ ఉద్యమాలకు తీరని లోటు అని మొదటినుండి యూ.టి.ఎఫ్ సంఘంలో సభ్యులుగా చేరి తుది శ్వాస వరకు క్రియాశీలక పాత్ర పోషిస్తూ సంఘ నిర్మాణంలో తనదైన శైలిలో అనేకమంది ఉపాధ్యాయులను ఉద్యమ కార్యకర్తలుగా తయారు చేశారని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బలరాం మొట్ట మొదలు ఉద్యోగ ఆరంభంలో నారాయణపురం మండలం అధ్యక్షుడిగా తర్వాత జిల్లా కార్యదర్శిగా జిల్లా అధ్యక్షులుగా జిల్లా గౌరవ అధ్యక్షులుగా అనేక బాధ్యతలు నిర్వర్తించి ఉపాధ్యాయులకు ఒక మోడల్ గా నిలిచి అనేక త్యాగాలు చేస్తూ సంఘ నిర్మాణములో ఎంతో కృషి చేశారని బలరాం సార్ తో నాకు మంచి అనుబంధం ఉండేదని వారి నాయకత్వంలో నేను అనేక ఉద్యమాలలో ప్రధాన కార్యదర్శిగా కలిసి పని చేశానని, యుటిఎఫ్ నాయకులుగా  ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పాఠశాలల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని, ఒక ఉద్యమ కెరటం పోరాటాల నక్షత్రం నేల రాలిందని, ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలో వారి ప్రస్థానం చరిత్రలో నిలిచిపోతుందని, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు రాజులేని కృషి చేసిన చరిత్ర వారిదని ప్రధానంగా భువనగిరి డివిజన్లో ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి గారు మాట్లాడుతూ కామ్రేడ్ బలరాం గారు యుటిఎఫ్ సంఘానికి మంచి గుర్తింపును తెచ్చి ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణకు తోడ్పడ్డారని,అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో ఏర్పడిన యూటీఎఫ్ సంఘాన్ని బలోపేతం చేయడమే కాకుండా హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసే విధంగా ప్రోత్సహించారని అన్నారు.  తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ఉపాధ్యాయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బలరాం గారు చిరస్మరణీయుడని వారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో జిల్లాలో అనేక రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా నిర్వహించారని అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తూ ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కామ్రేడ్ బలరాం ఆశయ సాధన కోసం అభ్యుదయ ఉద్యమాలను భవిష్యత్తులో కొనసాగించి ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ఉపాధ్యాయులు  ముందుండాలని కోరారు.ఈ సంతాప సభలో టి.యస్.యూ.టి.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి TSUTF యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మిర్యాల దామోదర్ ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముక్కెర్ల యాదయ్య నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు అవ్వారి గోవర్ధన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎన్.సోమయ్య రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జే.యాకయ్య టాప్రా నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ టాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ లింగా అరుణ తెలంగాణ గురుకుల విద్యాసంస్థల మాజీ కార్యదర్శి వెంకట్ నర్సయ్య చిట్యాల మాజీ జడ్పిటిసి పానుగుల్ల అచ్చాలు యాదాద్రి భువనగిరి సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డి జహంగీర్ TSUTF జిల్లా కార్యదర్శి బొమ్మగాని ముత్యాలు,వెంకట్ రెడ్డి,స్వామి,మల్లేశం నాయకులు కట్టా రమేష,దోనూరి బుచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి,దామోదర్,మోటే సత్తయ్య, సిపిఎం యాదాద్రి జిల్లా నాయకులు కొండమడుగు నరసింహ సంఘ చౌటుప్పల మండల శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీరాములు తదితరులు పాల్గొన్నా.రు