ప్రమాద బీమా అందజేసిన పీఏసీఎస్ చైర్మన్..

PACS Chairman who gave accident insurance..– నామినికి రూ.2 లక్షల పీఏంజేజేవై పంపిణీ
నవతెలంగాణ – బెజ్జంకి 
కేడీసీసీ ఖాతాదారురాలు సుమలత మృతి చెందడంతో పీఎంజేజేవై పథకంలో రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును శనివారం మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకు అవరణంలో పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు మృతురాలి నామినికి బ్యాంక్,పీఏసీఎస్ సిబ్బందితో కలిసి అందజేశారు. ప్రతి ఒక్క ఖాతాదారుడు ప్రమాద బీమా సేవలను వినియోగించుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు సూచించారు.బ్యాంక్ మేనేజర్ ప్రవీన్,సూపర్ వైజర్ దుర్గం,పీఏసీఎస్ సీఈఓ శ్రీనివాస్,సిబ్బంది బుచ్చయ్య,అనిల్,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
186 మంది రైతులకు రుణమాపీ ..
పీఏసీఎస్ యందు వ్యవసాయ రుణాలు పొందిన సుమారు 186 మంది రైతులు మొదటి విడత రుణమాఫీకి ఎంపికయ్యారని పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు తెలిపారు.రూ.1,17,66,963 ప్రభుత్వ రుణమాఫీ చేసిందని శరత్ రావు పేర్కొన్నారు.