మండలంలోని కొయ్యుర్ గ్రామ రెడ్డిగాండ్ల సంఘం నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకొన్నారు. గ్రామశాఖ అధ్యక్షుడుగా అయిత సంపత్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడుగా అయిత రాఘవరెడ్డి, ఉపాధ్యక్షుడుగా తోటపల్లి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కుంభం బాపురెడ్డి, కోశాధికారిగా అయిత స్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చందు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన రెడ్డిగాండ్ల సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘం బలోపేతానికి, హక్కులపై పోరాటం చేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా పేర్కొన్నారు.