కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

Joining Congress party..– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచ్చిన ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ అర్బన్ మండలం రుద్రావరం గ్రామనికి చెందిన విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకులు కసార్ల అరుణ్ ఆధ్వర్యంలో శనివారం సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారులుకి వచ్చాక ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం రైతు పక్షపాతి గతంలో ఏ విధంగానైతే పనులు చేశామో అధికారులకు వచ్చాక కేవలం ఏడు మాసాల్లోనే ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రస్తుతం ఒకవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సమపాల్లాలో కొనసాగిస్తున్నామన్నారు. ఆనాడు ధనిక రాష్ట్రంగా ఉండి కూడా అప్పటి ప్రభుత్వం చేయలేని పనులను ప్రస్తుతం మేము చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తున్నామన్నారు.
ముంపు గ్రామాల ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కింద 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.త్వరలోనే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారిస్తామన్నారు.ఈ ప్రాంతానికి,రాష్టానికి ఎంతో ఉపయోగపడే రైతు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసి వన్ టైం సీట్లిమేట్ లో పాస్ పుస్తకాలను ఇవ్వడం జరుగుతున్నారు.రైతులు మళ్ళీ బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాల్సిందిగా తెలిపారు.. ఎవరు ఊహించిన విధంగా 31 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు.పేదలకు అండగా ఉండే కాంగ్రెస పార్టీ కి  అండగా ఉండాలన్నారు.గత ప్రభుత్వం విలువైన సంపదను ఆడంబరాలకు  ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టారు.కానీ ప్రస్తుతం ప్రజా ప్రభుత్వలో పైసా పైసా కూడా పెట్టి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.ఇచ్చిన హామీలను తప్ప కుండ అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, మాజీ సర్పంచ్ ఊరడి రామ్ రెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.