– బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం
గూడూరు మాజీ సర్పంచ్ సత్తయ్య
నవతెలంగాణ – కొత్తూరు
విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసిన ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని మాజీ సర్పంచ్ సత్తయ్య అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి మాజీ ఉపసర్పంచ్ దయానంద్ గుప్త తో కలిసి హాజరై ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చక్కటి విద్య బోధనలు చేశారని అన్నారు. వారి బోధనలో ఎంతోమంది విద్యార్థులు విద్యను అభ్యసించారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల అభివృద్ధికి కృషిచేసి బదిలీపై వెళ్తున్న హై స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, మధు, వెంకటయ్య, ముఖరంజా, లావణ్య ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు జయమ్మ, ఉషారాణి, లక్ష్మీకాంత్ రెడ్డి లకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు లింగం గౌడ్, యాదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.