నవ తెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని గ్రామాల ప్రజలందరికీ ఎస్ ఐ మొహమ్మద్ యాసీర్ అరాఫత్ హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ రాబోయే 48 గంటల లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లే ప్రమాదం ఉందిని ప్రజలు ఏదయినా ప్రయాణాలు (టూర్లు) ముందే అనుకొని ఉంటే అట్టి ప్రయాణాలు 48 గంటలు వాయిదా వేసుకోవాలని,అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు వెళ్ళోద్దు అని తెలిపారు.రోడ్ల పై వరద నీరు ప్రవహిస్తున్నపుడు ప్రజలు ఏమవుతుంది లే అని నిర్లక్ష్యంగా వ్యవహరించి అలాంటి రోడ్లు దాటితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కావున ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి రోడ్లు దాట రాదని సూచించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వర్షం వల్ల ఏదయినా సమస్య వస్తే వెంటనే 100 నంబర్ కి కాని, 8712659860(ఎస్ ఐ బాల్కొండ) నెంబర్ కి కాల్ చేయగలరని కోరారు.చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు.కరెంటు స్తంభాలు ముట్టుకోరాదని బాల్కొండ ఎస్ ఐ తెలిపారు.