తాజాగా ఉండాలంటే..

తాజాగా ఉండాలంటే..కాఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ తాగందే ఏ పనీ ముందుకు సాగదు చాలా మందికి. బ్లాక్‌ కాఫీ, ఫిల్టర్‌ కాఫీ ఇలా ఇందులో చాలా వెరైటీలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది నెల సరుకుల్లో ఎక్కువగానే కాఫీ పౌడర్‌ తెచ్చుకుంటారు. అది కొన్ని రోజులు బానే ఉంటుంది. తర్వాత గట్టి పడుతుంది. అలా గట్టిగా, ముద్దలాగా అవ్వకుండా ఉండాలంటే కొన్ని టిప్స్‌ ఫాలో అవ్వాలి.
తేమ లేకుండా..
కాఫీ పౌడర్‌ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే వాటిని తేమ ఉన్న ప్రదేశంలో ఉంచకూడదు. పొడిగా ఉన్న ప్రదేశంలోనే పెట్టండి. దీని వల్ల కాఫీ గడ్డ కడుతుంది.
గాలి చొరబడని కంటైనర్‌..
కాఫీ పొడిని గాజు సీసాలో స్టోర్‌ చేయండి. మూత గట్టిగా ఉండేలా చూసుకోండి. లేదంటే కాఫీ పొడి ముద్దలా తయారవుతుంది. కాబట్టి, గాలి చొరబడని కంటెయినర్‌లో పెట్టండి.