జోహార్లయ్యా అమర కవివర్యా

Joharlaiyya Amara Kavivaryaసాకి:
కవితా శరథి.. పాటల పయోనిధి..
సాహిత్య సారధి….
అభ్యుదయ భావాల నిధి… తెలంగాణ వాది..
మహోద్యమాల వారధి…
దాశరథి…. దాశరథి…
పల్లవి:
‘దాశరథి కష్ణమాచార్యా
ఆరని జ్వాలలాంటి అమర కవివర్యా’ (2)
‘జోహార్లయ్యా నీకు జోహార్లయ్యా’ (2)
‘శతకోటి శతకోటి జోహార్లయ్యా’ (2)
చరణం 1:
‘పీడిత ప్రజలందరి పక్షాన నిలిచావు
జైలు గోడల్ని సైతం అక్షరాలతో నింపావు’ (2)
‘పద్యాన్నే పదునైన ఆయుధంగా మలిచి
నిజాం రాజు గుండెల పై నిర్భయంగా విడిచి’ (2)
అగ్నిధార కురిపించిన ఉగ్రనేత్రుడా
రుద్రవీణ మారుమ్రోగించిన రౌద్రవైణికుడా
‘గాయపడిన నీ గుండెలో’ (2)
రాయబడని కావ్యాలింకెన్నుండెనో ||దాశరథి కవివర్యా||
చరణం 2:
‘జన్మభూమినే కన్నతల్లిలాగ తలచావు
విముక్తి కలుగు వరకు నిర్విరామంగా నడిచావు’ (2)
‘ఉద్యమాన ఉవ్వెత్తున ఉప్పెన వలె ఉరికి
తెలంగాణవీణ నుండి స్వరములు ఒలికించి’ (2)
కవితాపుష్పకమెగరేసిన కవిసింహమా
తిమిరంతో సమరంజేసిన యుద్ధవీరోత్తమా
‘గాయపడిన నీ గుండెలో’ (2)
రాయబడని కావ్యాలింకెన్నుండెనో ||దాశరథి జోహార్లయ్యా||
– కార్తీక రాజు, 8977336447