ఫోల్డబుల్‌ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌

– సామ్‌సంగ్‌ బిజినెస్‌ హెడ్‌ రో
న్యూఢిల్లీ : భారత్‌లో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పెరుగుతుందని సామ్‌సంగ్‌ మొబైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ టీఎం రో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లలో భారత్‌ ఒక్కటన్నారు. భారతదేశంలో విక్రయిస్తున్న దాదాపు 80శాతం స్మార్ట్‌ఫోన్‌లు రూ.30,000 కంటే తక్కువ ధరను కలిగి ఉన్నాయన్నారు. దేశంలో అత్యంత కీలకంగా గెలాక్సీ ఫోల్డబుల్స్‌ ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం మార్కెట్‌ డిమాండ్‌ పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.