నాటుకు వెళుతున్న కూలీలకు గాయాలు..

Injuries to laborers going to plantation..నవతెలంగాణ – కోదాడరూరల్ 
మండల పరిధిలోని దొరకుంట గ్రామ శివారులో జాతీయ రహదారి 65 పై నాటుకు వెళుతున్న కూలీలను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి న ప్రమాదంలో కూలీలకు గాయాలు అయిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దొరకుంట గ్రామానికి చెందిన  పలువురు మహిళలు వరి నాటుకి  జాతీయ రహదారి 65 పై నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో విజయవాడ నుండి హైదరాబాదు వెళుతున్న గుర్తు తెలియని వాహనం వారిని వెనక నుండి ఢీకొట్టడంతో గ్రామానికి చెందిన సుంకరి రాజ్యలక్ష్మి, దొంగరి రమాదేవి, ఎర్రంశెట్టి కావ్య లకు ప్రమాదంలో గాయాలు అయినాయి. వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో సుంకరి రాజ్యలక్ష్మి కి తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   బాధితుల కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు వాహనం ఆచూకీ కోసం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.