నవతెలంగాణ – కంఠేశ్వర్
ఆశా వర్కర్ల సమస్యల పైన సోమవారం తలపెట్టిన కలెక్టరేట్ కార్యాలయం ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 ఇవ్వాలని ఇతర సమస్యల పైన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఉంటుందని ఆమె అన్నారు. ప్రభుత్వము 15 రోజుల సమ్మె హామీలు ఆశా వర్కర్ల 15 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఫిబ్రవరి 9న ఆరోగ్యశాఖ కమిషనర్ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పారితోషికాలను రూ.18,000 ఫిక్స్డ్ వేతనం గా నిర్ణయించాలి. ఆశాలకు గత గత 19 ఏళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ సర్వీసు నిర్వహిస్తున్న వారికి పరీక్ష పేరుతో తొలగించాలని నిబంధనను ఎత్తివేయాలని వారు కోరారు. గతంలో ఇచ్చినట్టుగానే ఆశా వర్కర్ల వేతనాలు ప్రతినెల ఐదో తారీకు లోపు వారి అకౌంట్లో జమ చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇస్తున్న పారితోషికంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు ఈ సమస్యల పరిష్కారానికై జులై 22న జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు సుకన్య, పద్మా, సునీత, స్వప్న, రేవతి, గౌరీ, గీత తదితరులు పాల్గొన్నారు.