తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలి

Promises of Telangana activists should be fulfilled– అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలి: టియూఎఫ్ ఫోరం నాయకులు 
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అందుకు ప్రభుత్వం త్వరలోనే  అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని టియూఎఫ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.టియూఎఫ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రమైన తాడిచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమ కారులు మాట్లాడారు తెలంగాణ ఉద్యమ కారులను ప్రభుత్వం గుర్తించి వెంటనే ప్రతి ఉద్యమ కారునికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ కారులను తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం, ఫింఛన్, బస్సు. ట్రైన్ హెల్త్ కార్డులు ఇచ్చి జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులను ఆదుకోవాలని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు క్యాబినెట్ మంత్రి వర్గం ఉద్యమ కారుల అంశంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిని రాజయ్య యాదవ్, మండల అధ్యక్షులు ముడితనపెల్లి ప్రభాకర్, ప్రదాన కార్యదర్శి బూడిద సతీష్, ఉపాధ్యక్షులు చొప్పరి రాజేందర్ ( రాజు ), మహిళా అధ్యక్షురాలు బండారి యశోద, టియూఎఫ్ స్టేట్ మెంబర్ దుబాసి పార్వతక్క, గడ్డం జిల్లా అధ్యక్షురాలు గడ్డం సమ్మక్క, మీనుగు నాగయ్య, కోట చంద్రమౌళి, అవిర్నేని పురుషోత్తం రావు, షేక్ చాంద్ పాషా, బండారి శంకరయ్య, ఆకుల రాజేశం, షేక్ చాంద్ పాషా, కోట నవీన్, ఊట్నూరి రమేష్ పాల్గొన్నారు.