మల్లారంలో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు

Extensive sanitation works in Mallaramనవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు ఆధ్వర్యంలో ఆదివారం విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు.ఇటీవల ఎనిమిదవ వార్డు ప్రజలు తమ వార్డులో కంపు కొడుతుంది పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శికి వినపత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యదర్శి విస్తృతంగా పారిశుధ్యం పనులు సిబ్బందితో నిర్వహించారు. అంతర్గత రోడ్లపై చెత్త, చెదారం, డ్రైనేజీల్లో మురుగు నీరు ప్రవహించేలా మురికి కాల్వలు శుభ్రం చేయించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చలించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, కారొబార్,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.