– కొత్త నీరు చేరడంతో రైతాగంలో ఆనందం…
నవతెలంగాణ – రెంజల్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కంద కుర్తి గోదావరి త్రివేణి సంగమం లో జలకలతో ఉత్తి పడుతుంది. గత 15 రోజుల కిందట ఎడారిగానున్న గోదారమ్మ నేడు కొత్త నీటితో కళకళలాడుతోంది. గోదావరి, మంజీరా, ఆరిద్ర మూడు నదుల సంఘం వద్ద కొత్త నీరు రావడంతో గోదారమ్మ జలకళ సంతరించుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ భాగం నుంచి నీరు వస్తూ ఉండడంతో గోదావరిలో కొత్తనీటితో కళకళలాడుతోంది. కందకుర్తి గోదావరిలోకి కొత్త నీరు రావడంతో స్థానిక రైతాంగంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.