నవతెలంగాణ – మద్నూర్
ఈ వారంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వానాకాలం పంట సాగుకు ఎంతో అనుకూలించాయని మద్నూర్ మండలం వ్యవసాయ రైతులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఏడాది సాగుచేసిన పెసర మినుము సోయా కంది పత్తి తదితర పంటలకు సాగు చేసిన తర్వాత 15, 20, రోజులపాటు వర్షాలు పడక రైతన్నలకు ఆందోళన ఆందోళన కలిగించింది. ఈనెల 17 నుండి 21 వరకు అడపా గడప ముసురు వర్షం కు రియడం తో పంటలకు ఎంతో అనుకూలించాయని రైతన్నలు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. ఈనెల 19న 43.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈనెల 21న 33.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ విధంగా కురిసిన వర్షం వానకాలం పంటలకు ఎంతగానో అనుకూలించాయని వ్యవసాయ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.