నాటిన మొక్క వృక్షమయ్యే వరకు కాపాడుకుందాం..

Let's protect the planted plant until it becomes a tree..

– రాబోవు తరానికి కానుక ఈద్దాం…

– రుణమాఫీ సాహసోపేత నిర్ణయం..
– రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ-  డిచ్ పల్లి
నేడు నాటిన మొక్క వృక్షమయ్యే వరకు కాపాడుకుందామని, రాబో తరానికి ఇదొక కానుక ఇద్దామని, అడవుల సంరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఒక చెట్టును నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని లోలం, అమ్సన్ పల్లి, యెల్ల రెడ్డి పల్లి గ్రామాల శివారులో ఉన్న అటవీ భూముల్లో వర మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు కలకలలాడే అడవులు నేడు కనుమరుగయ్యాయని దీనిని కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అటవీ భూములు అక్రమాలకు గురికాకుండా చూడాలని సూచించారు. చెట్లతోనే వర్ష భావం సమతుల్యత ఆధారపడి ఉంటుందని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదుసార్లు హరితహారం కార్యక్రమం పెట్టి మొక్కలు నాటిన అ మొక్కల అన్నవాళ్లు ఏమన్నారు దీంతో హరితహారం ఫలితం అందరి ద్రాక్షగా మిగిలిందన్నారు. 28% కంటే ఎక్కువ అడవి ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. మన మహోత్సవంలో భాగంగా రేంజ్ పరిధిలో 100 ఎకరాలకు పైగా వివిధ రకాల మొక్కలను నాటడం జరుగుతుందని, ఇదే కాకుండా దీన్ని సంరక్షించే విధంగా అటవీ అధికారులు కృషి చేయడం జరుగుతుందన్నారు.
రుణమాఫీ సాహసోపేతా నిర్ణయం..
ఎన్నికల సమయంలో టీపిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి దేశంలోని 29 రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని 32 వేల కోట్లు భారంపడ్డ రైతుల కోసం, ఎవ్వరి చెయ్యని సాహసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తి చేశమన్నారు.లక్షలు రాని రైతులు ఎలాంటి ఆందోళన గురికాకుండా ఉండాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇప్పటికీ ఆదేశాలను జారీ చేశామని, రైతు వేదికల్లో విస్తరణాధికారుల వద్దకు వెళ్లి రుణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చని ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు ఏదైనా అవసరం ఉన్న రుణమాఫీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని రైతులకు సూచించారు.గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో రైతు రుణమాఫీ జరగలేదని, ఇదే కాకుండా ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రం ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారంటీలను ఆరు నూరైనా చేసి చూపుతోందన్నారు. అంతకుముందు లోలం రైతు వేదికలో ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించి రేంజ్ పరిధిలో ఉన్న  వివరాలను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, అమృత పూర్ గంగాధర్, రూరల్ అద్యక్షులు సంతోష్ రెడ్డి,ఎల్ ఐ సి గంగాధర్, మాజీ ఎంపిటిసి చింతల కిషన్, బోర్ వేల్ రాజేందర్ రెడ్డి,సోసైటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,కర్స మోహన్, ఆశిష్, మాజీ ఎంపీపీ నర్సయ్య,డిసిసి డెలిగేట్ సుధాకర్, గుట్ట గంగాధర్,డిప్యూటీ రేంజ్ అధికారి ఆసిఫ్ ఒద్దిన్, సెక్షన్ అధికారులు ఆనంద్ బాపురావు, సుబ్బారావు, రాజేశ్వర్, బీట్ అధికారులు,స్ట్రాయికింగ్ ఫోర్స్  సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తాహసిల్దార్ వెంకట్రావు, ఎంపీడీవో అనంతరావు ,ఎంపీఓ రాజ్ కాంత్ రావు,ఆర్ఐ మోహన్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.