– ఐకెపి ఏపిఎం కుంట గంగాధర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఈనెల 24న బుధవారం దివ్యాంగులకు స్థానికంగా బస్ పాసులు ఆర్టీసీ ఆర్మూర్ డిపో మేనేజర్ సహకారంతో స్థానికంగా జారీ చేయడం జరుగుతుందని ఐకెపి ఎపిఎం కుంట గంగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల దివ్యాంగులు వారి యొక్క పాత బస్ పాస్, సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, నాలుగు ఫోటోలు తీసుకొని కమ్మర్ పల్లి ఐకెపి కార్యాలయానికి వస్తే స్థానికంగానే బస్సు పాసులు జారీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. దివ్యాంగులు ఆర్మూర్ బస్సు డిపో వరకు వెళ్లి బస్సు పాసుల కోసం క్యూ లైన్ లో నిల్చుని అవస్థలు పడకుండా ప్రతి సంవత్సరం స్థానికంగా ఆర్టిసి డిపో మేనేజర్ సహకారంతో స్థానికంగానే ఐకెపి కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.అందరు దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 24 బుధవారం రోజున ఐకెపి కార్యాలయానికి వచ్చి బస్సు పాసులు పొందాలని కోరారు. ఈ విషయాన్ని యువకులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అర్హులైన దివ్యాంగులకు చేరవేసి 24వ తేదీన ఐకెపి కార్యాలయానికి పంపి బస్ పాసులు సద్వినియోగం చేసుకొనేలా సహకరించాలని ఏపీఎం కుంట గంగాధర్ విజ్ఞప్తి చేశారు.