కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీ లను వెంటనే అమలు చేయాలి సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు B, ప్రసాద్ డిమాండ్ చేశారు కామారెడ్డి సీపీఐ(ఎం) పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం గాంధారి లో జరిగింది సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను 6 గ్యారంటీ లను సత్వరం అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వ్యవసాయ కూలీలకు మహిళలకు హార్దిక సహాయం చేయాలని రైతులకు ఈ వాన కాలం నుండి రైతు భరోసా అమలు చేయాలని, పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా భీమా ప్రీమియం ప్రభుత్వం భరించి అమలు చేయాలని, ధరణి సమస్యలు పరిష్కరించాలని రెండు లక్షల లోపు రుణమాఫీ అమలు చేయాలని, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ధాన్యానికి ఇతర పంటలకు బోనస్ ఇవ్వాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వ్యవసాయ ప్రణాళిక వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు రీయంబర్స్ బకాయిలు విడుదల చేయాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాళీ పోస్టులను భర్తీ చేయాలని, అన్ని రకాల పెన్షన్లను పెంచాలని ఇళ్ల స్థలాలు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మిచ్చిన హామీల కోసం పోరాటాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ తో పాటు జిల్లా కమిటీ సభ్యులు మోతిరాం నాయక్ , చంద్రశేఖర్ సురేష్ గోండ, నర్సింలు, అజయ్, ప్రకాష్ కిషన్ రావు,గేమ్ సింగ్,మదు, రాములు,రోజా, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.