
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట పట్టణంలోని నాగార్జున గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడిబి బ్యాంకు లో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. బ్యాంకులో రైతు ఖాతాలో జమవుతున్న రైతు రుణమాఫీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకు సిబ్బంది చూడాలని తేలిపారు. గ్రామీణ బ్యాంకు నందు కేసారం గ్రామంలో వచ్చిన మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో కలెక్టర్ మాట్లాడారు రుణమాఫీ రైతు ఖాతాలో ఎంత జమ అయిందో కలెక్టర్ పరిశీలించారు. ఖాతాలో 95,650 రూపాయలు రైతు రుణమాఫీ క్రింద జమ అయినవని రైతు కలెక్టర్కు తెలిపారు. అనంతరం ఎస్బిఐ ఎడిబి బ్యాంకును కలెక్టర్ పరిశీలించారు. రైతు రుణమాఫీ వాల్య తండా గ్రామానికి చెందిన ధరావత్ నాగులు 81,057, రుణమాఫీ కింద లోన్ తీసుకోనగా ప్రభుత్వం పూర్తిగా 81,057 రుణమాఫీ చేసిందని నాగులు కలెక్టర్కు వివరించారు. పిల్లలజగ్గు తండా గ్రామానికి చెందిన గుగులోతు సాజి క్రాప్ లోను ద్వారా 94, 148 రూపాయలు తీసుకొనగా రుణమాఫీ కింద ప్రభుత్వం 94,148 రూపాయలు జమ చేసిందని సంతోషంగా కలెక్టర్కు వివరించారు. బ్యాంకర్లు రైతులకు రుణమాఫీ ఆధార్ అనుసంధానం చేసిన ఖాతాలో జమైనది వివరంగా తెలపాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట లీడు బ్యాంకు మేనేజర్ చింతల బాబుజి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, వ్యవసాయ అధికారి దినకర్, బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.