
పెద్దవంగర మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా ఉపేందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సై గా విధులు నిర్వహించిన మహేష్ ఖమ్మం జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఎస్సై ఉపేందర్ బయ్యారం ఎస్సై గా విధులు నిర్వర్తిస్తూ బదిలీ పై పెద్దవంగర స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవన్నారు.