జనహితంతో సమస్యలు పరిష్కారం: తహసీల్దార్ సుజాత

Solving problems with Janahit: Tehsildar Sujataనవతెలంగాణ – వేములవాడ రూరల్
గ్రామీణ ప్రాంతాల ప్రజలు భూ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి జనహిత కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ సుజాత తెలిపారు.  వేములవాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జనహిత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా జనహితలో ఫిర్యాదు చేసుకోవచ్చని, సమస్యలు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు.గత రెండు రోజులు కురిసిన వర్షాల కారణంగా, వేములవాడ రూరల్ మండలంలోని గ్రామాల్లో ఇల్లు కూలిపోయి ఆస్తి నష్టం జరిగినట్టయితే తహసీల్దార్ కార్యాలయంలో తెలుపాలని ఎమ్మార్వో సుజాత అన్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అదేవిధంగా చూస్తామని ఆమె  తెలిపారు.కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.