– కన్నీరుమున్నీరవుతున్న మేకల యజమానులు
నవతెలంగాణ – మల్హర్ రావు
కుక్కల దాడిలో నాలుగు మేకలు మృతి చెందిన సంఘటన మండలంలోని కొయ్యుర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మేకల యజమానుల పూర్తి కథనం ప్రకారం రోజులా సోమవారం ఉదయాన్నే మేకలను మెపెందుకు విడిసిపెట్టినట్లుగా తెలిపారు.అయితే మేకల కాపరి సాయంత్రం మేతకోసం ఉరుప్రక్కన మేపుతుండగా ఉరకుక్కలు ఒకేసారి మేకలపై దాడిచేసినట్లుగా వాపోయారు కుక్కల దాడుల్లో లకావత్ సవెందర్ చెందిన ఒక మేక, అడపా సంపత్ కు చెందిన ఒక మేక, మొగిలి మల్లేష్ కు చెందిన ఒక మేకను కుక్కలు కొరినట్లుగా అక్కడికక్కడే మేకలు చనిపోయినట్లుగా తెలిపారు. చనిపోయిన మరో రెండు మేకలు దొరకలేదని యజమానులు పేర్కొన్నారు.ఆర్థికంగా ప్రభుత్వం తమను అదుకొని,కుక్కలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.