– వెటరన్ హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పారిస్ ఒలింపిక్స్‌తో కెరీర్‌కు గుడ్‌బై పలుకనున్నాడు. పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆరంభం కానుండగా.. విశ్వ క్రీడల అనంతరం వీడ్కోలు ప్రకటిస్తానని శ్రీజేశ్ తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో శ్రీజేశ్ కీలక సభ్యుడు. మూడు సార్లు ఒలింపిక్స్‌లో పోటీపడిన శ్రీజేష్.. కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచకప్‌లు సహా ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. పారిస్ ఒలింపిక్స్ శ్రీజేశ్ కెరీర్లో నాల్గో ఒలింపిక్స్ కానున్నాయి. ‘ 2024 ఒలింపిక్స్‌లో చివరిసారిగా బరిలోకి దిగుతున్నాను. ఇన్నేండ్ల ప్రయాణంలో కుటుంబం, సహచరులు, అభిమానులు, హాకీ ఇండియా అమోఘమైన ప్రేమాభిమానాలు చూపించాయి. నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. పారిస్‌లో పతకం రంగు మార్చటమే మా ముందున్న లక్ష్యం’ అని పీఆర్ శ్రీజేష్ అన్నాడు.