– ఆమనగల్ మున్సిపల్ చైర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్
– విఠాయిపల్లిలో వన మహౌత్సవం
నవతెలంగాణ-ఆమనగల్
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరంక్షించాలని ఆమనగల్ మున్సిపల్ చైర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్ అన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామంలో సోమవారం వన మహౌత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. విఠాయిపల్లి గ్రామం సమీపంలో ఉన్న పలు వేంచర్‌లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటికి కంచెలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహౌత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరంక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వసంత, వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య, కౌన్సిలర్లు సుజాత రాములు, చెన్నకేశవులు, చెక్కల లక్ష్మణ్, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.