రేపు కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

– ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు బీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 24న ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా, మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటాలనీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు.