45 రోజుల బడ్జెట్‌ సమావేశాలను కుదించడం సరిగాదు

– ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నేడు నిరసన : ఏలేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బడ్జెట్‌ సమావేశాలను 45 రోజుల నుంచి 10 రోజులకు కుదించడం సరిగాదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. దీనిని నిరసిస్తూ మంగళవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతామన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 8:30 నిమిషాలకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బీజేపీ శాసనసభా పక్ష సభ్యులంతా బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌లో కలుసుకుంటామని తెలిపారు.