నవతెలంగాణ నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలాన్ లో పోచారం ప్రధాన కాలువపై నిర్మించిన బ్రిడ్జిపై ఏర్పాటు చేస్తున్న పారాఫిట్ వాల్ ను మంగళవారం రోజు ఇరిగేషన్ ఈ ఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రిడ్జ్ పై ఇరువైపులా పారాఫిట్ వాల్ నిర్మిస్తున్నట్లు అయినా తెలిపారు. పనులు నాణ్యత లోపం లేకుండా చేయాలని కాంట్రాక్టర్కు ఆయన ఆదేశించారు.