పిల్లలు పరిశుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: డాక్టర్ ప్రతాప్ రెడ్డి

నవతెలంగాణ-ధర్మసాగర్
పిల్లలు పరిశుభ్రతను పాటించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ ప్రతాప్ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో మంగళవారం రాష్ట్రీయ బాల స్వస్య కార్యక్రమం ఆర్ బి ఎస్ కె వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన అప్పటినుండి 18 సంవత్సరాల లోపు ఉన్నవారికి రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులకు,పండ్లకు సంబంధిత వ్యాధుల పట్ల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పిల్లల్లో పరీక్షల్లో ఏమైనా లోపం ఉన్నట్లు తెలిస్తే అవసరమైన వారికి ఉచితంగా వైద్యాన్ని అందించడమే కాకుండా వ్యాధిని బట్టి శాస్త్ర చికిత్సలను కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలిపారు. విద్యార్థులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు ఈగలు లేకుండా చూసుకోవాలని సూచించారు.అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యంలో పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. పాఠశాలలోని 171 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమాలను 2016 నుండి చేయడం జరుగుతుందని, ప్రతి ఏటా ఒక్కసారి ప్రతి పాఠశాలలో, అంగన్వాడి సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ క్రాంతి కుమారి, ఫార్మసిస్ట్ దీప్తి, ఏఎన్ఎం ఊర్మిళ సిబ్బంది విద్యార్థుని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.