మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి 

– తాడ్వాయి ఎస్ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి
– గంజాయి పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ 
నవతెలంగాణ -తాడ్వాయి 
ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగానికి రవాణాకు దూరంగా ఉండాలని తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సూచించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో గంజాయి పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ  మళ్ళీ గంజాయి సప్లై చేయడం, అమ్మడం చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత విద్యార్థులు మాద ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. గంజాయి అక్రమ రవాణా కేసులు ఎవరైనా యువత ఒకసారి చిక్కుకొని అరెస్ట్ అయితే వారి భవిష్యత్తు నాశనమైనట్లే అని అన్నారు. నిందితులపై నేరం రుజువైతే 10 ఏళ్లకు పైబడి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్మిన రవాణా చేసిన వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.