నవతెలంగాణ ఆర్మూర్
విద్య రంగా అభివృద్ధి కొరకు గతంలో నియమించిన వివిధ కమిషన్లు విద్యారంగానికి కనీసంగా బడ్జెట్లో10 శాతం అయినా కేటాయించాలని సూచించినప్పటికీ ప్రస్తుత బడ్జెట్లో 2.66 శాతం కేటాయించడం ఈసారి నిరాశపరిచింది అని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ,జిల్లా బాధ్యులు పి శాంతన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేటాయింపును బట్టి విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థమవుతుంది.తగిన కేటాయింపులు లేకుండా అందరికీ నాణ్యమైన విద్య అందించడం సాధ్యం కాదు అనే విషయం పాలకులు గుర్తించడం లేదు.ఈ బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు,పేదలకు, నాణ్యమైన విద్యను దూరం చేస్తుంది. విద్యను ప్రైవేటీకరించ దానికే ఉపయోగపడుతుంది. బడ్జెట్లో ఇంత తక్కువ కేటాయింపులు వలన కామన్ స్కూల్ విధానం నేరవేరడం కలగానే మిగిలిపోతుంది. విద్యా రంగ ప్రవేటీకరణకు ప్రోత్సహించడమే అవుతుంది అని అన్నారు.బడ్జెట్ లో ఆధాయం పన్ను మినహాయింపులు పెంచకపోవడం వలన మధ్యతరగతి వేతన జీవులు కూడా బడ్జెట్ నిరాశ మిగిల్చింది. పాత విధానంలోని స్లాబులు మార్చకుండా కొత్త విధానంలో మాత్రమే కొంత వెసులుబాటు కల్పించడం వలన వేతన జీవులకు లాభమేమి జరగడం లేదు. బడ్జెట్ క్రమంగా వేతన జీవుల సేవింగ్స్ ప్రాధాన్యత ను తగ్గిస్తూ వస్తుంది. అని అన్నారు.