నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: వికలాంగుల అక్క జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మంగళవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్అధికారి స్మిత సభర్వాల్ వికలాంగులను కించపరిచే విదంగా జులై 21నాడు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినారు. ఆమె పెట్టిన పోస్ట్ ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం మరియు 2016 RPWD చట్టంలో పేర్కొన్న సమానత్వం మరియు వికలాంగుల పట్ల వివక్షతకు పూర్తి భిన్నమైంది.వికలాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా అవమానించారు. వికలాంగులను అగౌరవపరిచెందుకు ప్రయత్నం చేశారు.2016 RPWD చట్టం సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల కొరకు ప్రత్యేకంగా వైకాల్యాన్ని బట్టి రిజర్వ్ పోస్టులు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టంగా ఉంది. 2016 RPWD చట్టం సెక్షన్ 92(A),(B),(E) కేసు నమోదు చేయాలని కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి చౌటుప్పల్ డివిజన్ కోశాధికారి బలుగూరి ఆంజనేయులు చౌటుప్పల్ మండల అధ్యక్షులు సంజీవ శంకర్ మండల కార్యదర్శి రాయగిరి యాదగిరి టౌన్ నాయకురాలు పోతగల యాదమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది