– సీపీఐ(ఎం) వికారాబాద్ జిల్లా కమిటీ డిమాండ్
నవతెలంగాణ-వికారాబాద్ కలక్టరేట్
వికలాంగులను కించపరిచిన ఐఏఎస్ స్మితాసభ ర్వాల్‌ను అనర్హురాలిగా ప్రకటించాలని, తక్షణమే కేసు నమో దు చేసి అరెస్ట్ చేయాలని, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ప్ర భుత్వానికి డిమాండ్. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట ఆర్థి కశాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ వికలాంగులను కించపరిచే వి ధంగా జులై 21 ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టినారని అన్నారు. ఆమె పెట్టిన పోస్ట్ ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం, 20 16 =ూఔణ చట్టంలో పేర్కొన్న సమానత్వం, వికలాంగుల పట్ల వివక్షతకు పూర్తి భిన్నమైందని పేర్కొన్నారు. విక లాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దే శపూర్వకంగా అవమానించడం ఎంత వరకు సమంజస మని ప్రశ్నించారు. వికలాంగులను అగౌరవపరిచేందుకు ప్రయత్నం చేశారు. చట్టం సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు ప్రత్యేకంగా వైకాల్యాన్ని బట్టి రిజర్వ్ పోస్టులు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టంగా ఉన్న విషయం ఆమెకు తెలియదా అని ప్ర శ్నించారు. సమాజంలో వికలాం గులకు ఉన్న అవకాశాల ను తగ్గిం చే విధంగా మాట్లాడ డం సరైంది కాదన్నారు. ట్రెయిన్లో నుంచి దొంగలు తోసేస్తే ఒక కాలును పోగొట్టుకుని, వెన్నె ముక గాయాలకు గురైన అరుణిమా సిన్హా ఎవరెస్ట్ ఎక్కిం దని, ఎవరెస్టును అధిరోహించిన ప్రపంచంలోనే తొలి ఫిమేల్ యాంప్యుటీగా ఘనత సాధించింది వికలాంగు రాలె కదా అన్నారు యాక్సిడెంట్‌లో ఒక కాలును పోగొ ట్టుకున్న సుధాచంద్రన్ భరతనాట్యంలో మేటిగా నిలిచా రాని అన్నారు. స్పైన్ ట్యూమర్ వల్ల నడుము కింది భా గం కదలికలు కోల్పోయినా పట్టుదలతో పారాలంపిక్స్లో లో పాల్గొని దేశానికి మెడల్ తెచ్చిన పారాలంపియన్లో స త్తా చాటిన దీపా మాలిక్ వికలాంగురాలేనని తెలిపారు. స్కోలియోసిస్ సమస్య బారిన పడిన ఇరా సింఘాల్ 20 14 సివిల్స్ టాపర్‌గా నిలిచినరన్నారు. స్మితా సభర్వాల్ త న వైఖరి మార్చుకోవాలని లేని యెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందాన్నారు.