డ్రగ్స్‌ని నిర్మూలించడంలో విద్యార్థులు సైనికుల్లా పని చేయాలి

డ్రగ్స్‌ని నిర్మూలించడంలో విద్యార్థులు సైనికుల్లా పని చేయాలి– ఓయూ ఓఎస్డీ, ప్రొఫెసర్‌ బి.రెడ్యా నాయక్‌
– నిజాం కళాశాలలో యాంటీ డ్రగ్స్‌ పై అవగాహన ర్యాలీ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
డ్రగ్స్‌ మహమ్మారిని నిర్మూలించడంలో విద్యార్థులు, యువత సైనికుల్లా పని చేయాలని ఓయూ ఓఎస్డి, ప్రొఫెసర్‌ బి.రెడ్యా నాయక్‌ సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిజాం కళాశాల ప్రాంగణంలో యాంటీ డ్రగ్స్‌ పై అవగాహన సదస్సు, ర్యాలీని విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా బి.రెడ్యా నాయక్‌ మాట్లాడుతూ సమాజ హితం కోసం సామాజిక స్పహతో డ్రగ్స్‌ సరఫరాను, వాడ కాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్‌ వాడకం వల్ల వ్యక్తుల జీవితాలే కాకుండా ఆయా కుటుంబాలు, దేశం, సమాజం ప్రమాదంలో పడుతుందన్నారు. డ్రగ్స్‌ అలవాటు, అడిక్షన్‌గా మారుతుందని డ్రగ్స్‌ వాడకుండా ఉండడమే కాకుండా డ్రగ్స్‌ ఎక్కడ కనిపించినా అరికట్టేందుకు విద్యారు ్థలు తమ వంతు పాత్రను పోషించాలని సూచించారు. అనంతరం నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రొఫెసర్‌ బి.బీమా మాట్లాడుతూ డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టడంలో నిజాం కళాశాల ముందు వరుసలో ఉంటుందని, ఈ క్రమంలోనే విద్యార్థులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను, విద్యార్థులను చైతన్యం చేస్తున్నారని వివరించారు. గన్‌ ఫౌండ్రీ కార్పొరేటర్‌ సురేఖ మాట్లాడుతూ డ్రగ్స్‌ వాడకాన్ని అరికట్టడంలో విద్యార్థులు సామాజిక బాధ్యతగా వ్యవహరిం చాలని ఆమె సూచించారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ విద్యాధర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ సరఫరాతో పాటు వాడకం అంతర్జాతీయంగా టెర్రరిజాన్ని తయారు చేస్తుందని తెలి పారు. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల వైస్‌-ప్రిన్సిపాల్‌, ప్రొఫెసర్‌ జి.ఉపేందర్‌ రెడ్డి, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎ స్‌ఎస్‌) ప్రోగ్రాం ఆఫీసర్స్‌ డాక్టర్‌ చిన్నాల వెంకటేశ్వర్లు, డాక్టర్‌ మంజుల, ఈఓసీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ తిరుపతి, అకాడమిక్‌ అసిస్టెంట్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కవిత, డిప్లమా కోర్సెస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ భవాని శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.