కంది పంటలో గోడ్డు తెగులు

కంది పంటలో గోడ్డు తెగులునవతెలంగాణ-కోడంగల్‌
కంది పంటలో గోడ్డు తెగులు ( స్టీరిలిటీ మొజైక్‌) వ్యాధి సోకినట్లుకంది పంట ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌. సుధాకర్‌, ఎరువక కేంద్రం శాస్త్రవేత్త లక్ష్మణ్‌, డాక్టర్‌ యమునరెడ్డి బృందం హస్నాబాద్‌ గ్రామంలో కొన్ని కంది పంట పొల్లాలను పరిశీలించారు. కంది పంటల్లో వచ్చే గొడ్డు తెగులు (స్టీరిలిటీ మొజైక్‌ ) గమనించినట్టు తెలిపారు. ఈ తెగులు చాలా ఉధ్రుతంగా ఒక వారం రోజుల్లో పొల్లం అంతటా చాలా తొందరగా కంది పంటలు వేసినపొల్లలో వ్యాప్తి చెందే గుణం కలిగి ఉంటుందన్నారు. తద్వారా చాలా వరకు దిగుబడి తగ్గించి అపార నష్టాన్ని కలిగిస్తాయని రైతులు చాలా అప్రమత్తంగా ఉండి ఈ తెగులును అతి త్వరగా నివారించుకోవాలని సూచించారు. ఈ వ్యాధి సోకిన పొల్లంలోని కంది మొక్కలను సామూలంగా ఏరి పారేయాలన్నారు, ఆరోగ్య కారమైన మొక్కలను రక్షించుకోవడానికి డైకోఫోల్‌ 3 నుండి 5గ్రాముల లీటర్‌ నీటికి లేదా వెట్టబుల్‌ సల్ఫార్‌ 3గ్రాముల లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తర్వాత వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసి నివారించుకోవచ్చు అన్నారు. ఈ తెగులు యొక్క వ్యాప్తిని క్రమం తప్పకుండా కొడంగల్‌ నియోజకవర్గంలోని కంది పంట వేసిన రైతుసోదరులు తమ తమ పొల్లలను గమనిస్తూ తాగు సూచనలను పాట్టించి నివారణ చెప్పట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ శంకర్‌ రాథోడ్‌. ఏఈఓజి. పావని. రైతులు ఎంట్ల మల్లయ్య, బొంగు బుగప్ప, నర్సిములు, బొంగు చిన్న అంజిలప్ప పాల్గొన్నారు.