కేంద్ర ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

నవతెలంగాణ డిచ్ పల్లి:

డిచ్ పల్లి మండల కేంద్రంలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సంగెం కిష్టయ్య, సీనియర్ నాయకులు నర్సయ్య మాదిగ అధ్యక్షతన నిర్వహించిన హలో మాదిగ- చలో ఢిల్లీ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు డల్లా సురేష్ మాదిగ పాల్గొని హలో మాదిగ- చలో ఢిల్లీ కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డల్లా సురేష్ మాదిగా, ఉమ్మడి  జిల్లా ఇన్చార్జి గంధమాల నాగ భూషణ్ మాట్లాడుతూ ఆగస్టు 10, 11న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బి ఎన్ రమేష్ మాదిగ నాయకత్వంలో హలో మాదిగ చలో ఢిల్లీ మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటపై నిలబడాలని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ మాటను నిలుపుకోవా లన్నారు. ఇప్పటికే 2014 నుండి నేటి వరకు బిజెపి ఎన్నో బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించిందని, కానీ ఎలాంటి అభ్యంతరం లేని అన్ని రాజకీయ పార్టీల మద్దతు సామాజిక న్యాయమైన టువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టడంలో కేంద్ర ప్రభుత్వం మాదిగల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే ఈ దేశం పైన ఒక్క రూపాయి భారం కూడా పడదన్నారు.  మాదిగలను మోసం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నట్లు భావించుకోవాల్సి ఉంటుందని, ఆగస్టు 10, 11 తేదీలలోపు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా మాదిగల పక్షాన పార్లమెంట్లో మాట్లాడాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ మరియు ఉషామేహ్ర కమిషన్ వేసి  మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై ఆశలు సజీవంగా ఉంచిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాట్లు వివరించారు. ఈ హలో మాదిగ చలో ఢిల్లీ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మార్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపేట నర్సయ్య మాదిగ, ఎంఎస్ఎఫ్ మాదిగ జిల్లా అధ్యక్షులు మల్లాని శివ మాదిగ, డిచ్ పల్లి మండల అధ్యక్షులు లింగం మాదిగ, సీనియర్ నాయకులు గంగారం మాదిగ, మోపాల్ మండల నాయకులు యాదగిరి మాదిగ, మల్లేష్ మాదిగ, నాయకులు దాసు మిట్టపల్లి సాయన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.