నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపెట్టారు : జక్కని సంజయ్

నవతెలంగాణ శంకరపట్నం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ బీజేపీ 8 మంది ఎంపీలు, తెలంగాణ ప్రజలకు మొహం, ఎలా చూపెడతారని ప్రజలపై ప్రేమ ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు విభజన హామీలను వెంటనే అమలు చేయించాలని 5 ఎండ్లలో ఒక్క పైసా తేని అసమర్థ ఎంపీ కరీంనగర్ చరిత్రలోనే ఒక్క బండి సంజయ్ మాత్రమేనని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొంగోని అభిలాష్, నాయకులు గుర్రం శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.